: ఒకర్నొకరు నిందించుకునే సమయం కాదిది: టీడీపీ నేత సోమిరెడ్డి


ఇది ఒకర్నొకరు నిందించుకునే సమయం కాదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు మనం తీసుకునే నిర్ణయానికి భవిష్యత్ తరాలు నిందించకుండా చూడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మీ మీద మేము, మా మీద మీరు విమర్శించుకుంటూ పోతే రాష్ట్రం ముక్కలవుతుందని, మన తరువాతి తరాలకు అన్యాయం చేసిన వారమవుతామని ఆ పాపంలో మనం పాలు పంచుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన సమయమని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు గుర్తించాలని సొమిరెడ్డి సూచించారు. తెలుగు గడ్డ ఎందరో దేశభక్తుల త్యాగఫలమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తెలుగుతల్లి ఆత్మఘోషించకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News