: మెగా ఫ్యామిలీ సినిమాలను అడ్డుకుంటాం: ఏపీఎన్జీవో
తెలంగాణకు కాంగ్రెస్ అధిష్ఠానం జై కొడుతుంటే, నిస్సహాయుల్లా మిగిలిపోయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులపై ఏపీఎన్జీవోలు మండిపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నేడు పలు ఆందోళనలు చేపట్టిన ఏపీఎన్జీవో సంఘం, ముఖ్యంగా చిరంజీవిపై విరుచుకుపడింది. మెగా ఫ్యామిలీ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇక కావూరి జిల్లాకు ఎలా వస్తారో చూస్తామంటూ సవాల్ విసిరింది.