: హైదరాబాద్ లో యూఎస్ కాన్సులేట్ మూసివేత
బాంబు పేలుళ్ల సెగ యూఎస్ కాన్సులేట్ కూ తగిలింది. హైదరాబాద్ లో నిన్న వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో భద్రత కారణాల రీత్యా నగరంలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో వీసాల ప్రక్రియ నిలిచిపోయింది. కాగా, భారత్ లో తీవ్రవాదుల దుశ్చర్యను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. భారత్ కు ఎలాంటి సహకారాన్నయినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.