: 29వ రాష్ట్రానికి కౌంట్ డౌన్ మొదలైంది
దశాబ్దాలుగా నానుతున్న తెలంగాణ అంశం తుది అంకానికి చేరుకుంది. ఈ సాయంత్రం ఢిల్లీలో యూపీఏ సమన్వయ కమిటీ భేటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలు ముగిశాయి. రెండు సమావేశాల్లోనూ తెలంగాణకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీంతో, మరికాసేపట్లో ఏఐసీసీ లాంఛనంగా ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయనుంది. ఈ రాత్రి ఏడు గంటలకు ఆరంభమయ్యే మీడియా సమావేశంలో ఈ విషయం అధికారికంగా వెల్లడిస్తారు.