: ముగిసిన సీడబ్ల్యూసీ భేటీ.. ఇంకాసేపట్లో నిర్ణయం
ప్రత్యేక రాష్ట్రంపై కీలక నిర్ణయం దిశగా మరో అతిముఖ్యమైన భేటీ ముగిసింది. సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరై ఏకవాక్య తీర్మానం చేశారు. అధినేత్రి సోనియాకు నిర్ణయాధికారం అప్పగించారు. ఇక నిర్ణయాన్ని ఈ రాత్రి ఏడుగంటలకు ఏఐసీసీ మీడియా సమావేశంలో వెల్లడిస్తారు.