: ఈ పాపం కేసీఆర్ కుటుంబానికి తగులుతుంది: నన్నపనేని
మహానుభావులు దశాబ్దాలు పోరాడి, నిరాహార దీక్షలు చేసి సాధించిన రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కారణం కేసీఆర్ అని, ఈ పాపం కేసీఆర్ కుంటుంబాన్ని వదలదని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు. కర్నూలు రాజధానిగా ఉంటే తెలంగాణ నిర్లక్ష్యానికి గురౌతుందని భావించి హైదరాబాద్ ను రాజధానిగా చేశామని అన్నారు. గుంటూరులో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామంటే రాజధానిలో విమానాశ్రయం ఉండాలని బేగంపేటలో ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ఆంధ్రలో వర్షాలొస్తే కొన్ని జిల్లాలు కొట్టుకుపోతాయని, గుక్కెడు నీళ్లు దొరకని ప్రాంతాలు చాలా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ ను ఈ రకంగా తయారు చేయడానికి 50 ఏళ్లు పట్టిందని ఇప్పడు ఎలా విభజిస్తారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఎన్నికల ప్రయోజనాలే తప్ప రాష్ట్ర శ్రేయస్సు పట్టదా? అని ప్రశ్నించారు.