: అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు భేటీ
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాదులో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించేస్తే తమ పరిస్థితేంటన్న దానిపై బాబు పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి మీడియా ఎదుటకు రాని బాబు, కొన్ని గంటల నుంచి హస్తినలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడంతో.. హుటాహుటీన సమావేశమవడం గమనార్హం.