: గూర్ఖాల్యాండ్ ఉద్యమకారుల భయంతో ప్రధాని నివాసం వద్ద భారీ భద్రత
గూర్ఖాల్యాండ్ ఉద్యమకారులు ఆందోళన చేస్తారనే భయంతో ప్రధాని నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం విజయవంతమైన నేపథ్యంలో గుర్ఖాల్యాండ్ ఉద్యమకారులు మరోసారి ఉద్యమ బాటపట్టారు. తెలంగాణపై ప్రకటన చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రధానికి నేరుగా నిరసన తెలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. దీంతో ప్రధాని నివాసానికి భారీ భద్రత కల్పించారు. గూర్ఖాల్యాండ్ ఉద్యమకారులు నేరుగా ప్రధాని, యూపీఏ చైర్ పర్సన్ లకు నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.