: ముగిసిన యూపీఏ సమన్వయ కమిటీ భేటీ
తెలంగాణపై నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఓ కీలక ఘట్టం ముగిసింది. యూపీఏ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశం ప్రధాని నివాసంలో నిర్వహించారు. 50 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీకి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స కూడా హాజరైనట్టు తెలుస్తోంది. కాగా, కొద్దిసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగనుంది. అనంతరం తెలంగాణపై ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.