: జరగాల్సింది జరిగిపోయింది: దిగ్విజయ్
ఏం జరగాల్సి ఉందో అది జరిగిపోయిందని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నిర్ణయం ఇప్పటికే అయిపోయిందని, ఇప్పుడు జరగాల్సిందేంటంటే కేవలం మిత్రపక్షాలకు సమాచారం చేరవేయడమేనని అన్నారు. ఇప్పటికే తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, ఆ దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. దిగ్విజయ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు చేస్తూవస్తున్నారు.