: క్రికెటర్లకు కోట్ల పంట


ఐపీఎల్-6 సీజన్ కోసం చెన్నైలో జరుగుతున్న వేలంపాట క్రికెటర్ల పంట పండిస్తోంది. ప్రతిభ గల క్రికెటర్లను కోట్లు కుమ్మరించి జట్లు సొంతం చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా యువ కెరటం గ్లెన్ జేమ్స్ మ్యాక్స్ వెల్ అత్యధికంగా 5.25 కోట్ల రూపాయలు పలికి రికార్డు సృష్టించాడు. ఇతడిని సొంతం చేసుకోవడానికి ముంబాయి ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ ఒక దానితో ఒకటి తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆఖరుకు 5 కోట్ల 25 లక్షలకు ముంబాయి ఇండియన్స్ మ్యాక్స్ వెల్ ను ఎగురేసుకుపోయింది. వేలంపాటలో మొదటి దశ ముగిసేసరికి.. 
క్రికెటర్ల ధరలు 
* అభిషేక్ నాయర్ (భారత్) 3.54కోట్లు (పూణే వారియర్స్)
* తిసార పెరేరా (శ్రీలంక) 3.54కోట్లు ( హైదరాబాద్ సన్ రైజర్స్)
* జోహన్ బోథ (సౌత్ ఆఫ్రికా) 2.5కోట్లు (ఢిల్లీ డేర్ డెవిల్స్)
* డారెన్ సమ్మీ (వెస్ట్ ఇండీస్ కెప్టెన్) 2.23 కోట్లు హైదరాబాద్ సన్ రైజర్స్)
* రీకీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 2.12 కోట్లు (ముంబాయి ఇండియన్స్)
* జేమ్స్ ఫాల్కనర్ (ఆస్ట్రేలియా) 2.1కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
* ఆర్పీ సింగ్ (భారత్) 2.1కోట్లు (రాయల్ చాలెంజెర్స్)
* మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా) 2.1కోట్లు (పూణే వారియర్స్)
* జెస్సీ రైడర్ (న్యూజిలాండ్) 1.3కోట్లు (ఢిల్లీ డేర్ డెవిల్స్)

  • Loading...

More Telugu News