: కన్నీళ్ళు పెట్టుకున్న ఆనం వివేకా


ఎప్పుడూ సరదాగా ఛలోక్తులు విసురుతూ, సీరియస్ మీడియా సమావేశాల్లో సైతం హాస్యం పండించగల రాజకీయనేతగా ఆనం వివేకానందరెడ్డి సుప్రసిద్ధుడు. అంతటి వ్యక్తి సైతం రాష్ట్ర విభజన అంశంపై స్పందించాల్సి వచ్చినపుడు కన్నీళ్ళ పర్యంతమయ్యారు. ఓ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. హైదరాబాదులో తనకు వీసమెత్తు స్థలం లేకున్నా, ఆ ప్రాంతంతో అనుబంధం తెంచుకోవాల్సి వస్తుందన్న ఊహే భరింపశక్యం కావడంలేదని గద్గదస్వరంతో చెప్పారు. తాను, హైదరాబాదులోనే పుట్టిపెరిగానని, లా కూడా అక్కడే చదివానని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజనను ఎవరూ హర్షించరని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News