: శ్రీశాంత్ బెయిల్ రద్దు చేయాలంటున్న ఢిల్లీ పోలీసులు


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో వివాదాస్పద క్రికెటర్ ఎస్.శ్రీశాంత్ బెయిల్ రద్దు చేయించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే వారు కోర్టులో దరఖాస్తు చేయనున్నారని తెలుస్తోంది. అతనితో పాటు బెయిలు పొందిన మరికొంతమంది బెయిల్ కూడా రద్దు చేయించాలని అనుకుంటున్నారట. ఈ కేసులో నేడు ఛార్జిషీటు నమోదుచేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఐపీఎల్ ఆరవ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్, ఇతర బుకీలపై తీవ్ర ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. దాంతో, ఇరవై ఏడు రోజుల పాటు శ్రీ తీహార్ జైల్లో గడిపాడు. చివరికి జూన్ 11న అతనితో సహా మరో 20 మందికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News