: గూర్ఖాల్యాండ్ పట్టుబిగిస్తోంది
తెలంగాణ స్ఫూర్తిగా మరిన్ని ప్రాంతాల్లో ఉద్యమం ఊపిరి పోసుకుంటోంది. దశాబ్దాలుగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న గూర్ఖాల్యాండ్ పౌరులు మరోసారి ఉద్యమంలోకి దూకారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ 3 రోజుల బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. వ్యాపార, వాణిజ్య, రవాణా, విద్యా వ్యవస్థలన్నీ నిలిచిపోయాయి. దీంతో గుర్ఖా జనముక్తి మోర్చా మరోసారి తన పట్టు బిగిస్తోంది. ఈసారి రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమం సాగుతుందని ఉద్యమనేతలు స్పష్టం చేస్తున్నారు.