: 15 మంది మంత్రుల రాజీనామా?
రాష్ట్ర విభజన అంశం క్లైమాక్స్ కు చేరిన సందర్భంలో 15 మంది రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఓ చానల్లో ఈ వార్త పలుమార్లు స్క్రోల్ అవడంతో రాజకీయవర్గాల్లో సంచలనం రేగింది. అయితే, కొద్దిసేపటి క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విభజిస్తే మాత్రం 15 మంది మంత్రులం రాజీనామా చేస్తామని గందరగోళానికి తెరదించారు.