: తెలంగాణకు మేం వ్యతిరేకం: ఒమర్ అబ్దుల్లా
ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రాల్ని ముక్కలు చేసుకుంటూ పోతే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకమని ఆయన ఢిల్లీలో తెలిపారు. ఓటేయాల్సి వస్తే తెలంగాణకు వ్యతిరేకంగా ఓటేస్తామని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.