: సీమాంధ్రకు కొత్త రాజధాని: కిషన్ రెడ్డి


రాష్ట్రం ముక్కలవ్వాల్సిందే అని ఎప్పటి నుంచో పట్టుబడుతున్న భారతీయ జనతా పార్టీ.. హైదరాబాదుపైనా తన వైఖరిని సుస్పష్టం చేసింది. హైదరాబాదు నగరమే తెలంగాణకు రాజధానిగా ఉంటుందని, సీమాంధ్రకు కొత్త రాజధాని అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాదులో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాకారం కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఎంతగానో పరితపిస్తున్నారని వివరించారు. ఇక, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోగా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందన్నారు.

  • Loading...

More Telugu News