: భార్య, మామల్ని తగలబెట్టిన మృగాడు


నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం శెట్టిపాలెంలో దారుణం జరిగింది. ఓ దుర్మార్గుడు భార్య, మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మామను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉండడంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News