: సద్దాం కత్తిని ఇరాక్ కు తిరిగేచ్చేసిన అమెరికా
సద్దాం హుస్సేన్ కార్యాలయం నుంచి దొంగిలించబడిన బంగారపు కత్తిని ఇరాక్ అధికారులకు అమెరికా తిరిగిచ్చేసింది. ఇరాక్ పై సంయుక్త దాడి జరిగిన సమయంలో కత్తి దొంగిలించబడింది. 43 అంగుళాలు ఉన్న కత్తిని నిన్న హోమ్ లాండు సెక్యూరిటీ డిపార్టుమెంటు ఇరాక్ అంబాసిడర్ కు ఇచ్చింది. మాంచెస్టర్, న్యూ హాంప్ షైర్ లో వేలంలో పెట్టిన ఓ కంపెనీ నుంచి ఆ కత్తిని 2012 జనవరిలో అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భద్రంగా ఉంచింది. అయితే, దాన్ని ఓ అమెరికన్ యుద్ధ చరిత్రకారుడు తమకు ఎనిమిది లక్షల 96వేలకు అమ్మినట్లు సదరు కంపెనీ తెలిపింది. కాగా, ఆ కత్తి సద్దాంకు బహుమతిగా వచ్చిందని, యుద్ధంలో ఉపయోగించేది కాదని ఇరాక్ డిపార్టుమెంటు తెలిపింది.