: మా ఓటు సమైక్యానికే... ప్రధాని, సోనియాలకు అసదుద్దీన్ లేఖ
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ. ప్రధాని మన్మోహన్ సింగ్ లకు లేఖలు రాశారు. ఈ లేఖలో తెలంగాణపై అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని, మజ్లిస్ పార్టీ సమైక్యరాష్ట్రానికే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే భవిష్యత్తులో సంఘ్ పరివార్ పుంజుకుంటుందని, దాని వల్ల మతతత్వ శక్తుల ప్రభావం పెరిగి అభివృద్ధి కుంటుపడుతుందని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.