: 'చలో ఢిల్లీ' అంటున్న మంత్రులు


ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. తెలంగాణపై ఈ సాయంత్రం కేంద్రం వెలిబుచ్చే నిర్ణయం ఎలా ఉండబోతోందన్నదే అందుకు కారణం. ఈ విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్న నేపథ్యంలో హస్తిన బాట పడుతున్న నేతల జాబితాలో రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ కూడా చేరారు. 'హైదరాబాద్' అంశాన్ని ఎలా పరిష్కరించనున్నారని వీరు హైకమాండ్ తో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక, పీసీసీ మాజీ ఛీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కూడా సాయంత్రం దేశ రాజధానికి పయనం కానున్నారు.

  • Loading...

More Telugu News