: ఢిల్లీకి బయల్దేరిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొండ్రు మురళి, కేంద్ర మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అధిష్ఠానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. వీరిద్దరూ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారని సమాచారం. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వీరిని కూడా భాగస్వాములను చేయాలనేది అధిష్ఠానం యోచన.