: డీఎన్‌ఏలో మార్పును ఇట్టే చెప్పేయవచ్చు


మన శరీరంలో ఎలాంటి చిన్న మార్పునైనా ఇట్టే చెప్పేయవచ్చట. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త శాస్త్రపరిజ్ఞానంతో క్షయ, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు సంబంధించి నిర్ధారణ, చికిత్సల్లో మరింతగా అభివృద్ధి సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మన శరీరంలోని డిఎన్‌ఏ ఉత్పరివర్తనాలలో ఒకేఒక మార్పు జరిగినా ఆ మార్పును ఇట్టే గుర్తించగలిగే ఒక సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరిజ్ఞానం క్షయ, క్యాన్సర్‌ వంటి వ్యాధుల నిర్ధారణ, చికిత్సల్లో కూడా ఎంతగానో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాము ప్రస్తుతం రూపొందించిన పద్ధతి, గతంలో ఉన్న ప్రక్రియలతో పోలిస్తే ఎంతో మెరగైనదని, దీనికి ఎంజైములు అవసరం లేదని, కేవలం డీఎన్‌ఏ సరిపోతుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న జార్జి సీలిగ్‌ చెబుతున్నారు. రోగనిర్ధారణ పరీక్షలకు ఈ పద్ధతి బాగా సరిపోతుందని, ఈ డీఎన్‌ఏ పరీక్షలో ఇంకా 200 దాకా జతలను పరీక్షించే అవకాశం ఉందని జార్జి వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News