: కళ్లకు కోట్ల సంవత్సరాలట!


కళ్లు పుట్టి ఇప్పటికి కొన్ని కోట్ల సంవత్సరాలయ్యాయట... అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికి లోకాన్ని చూపించేవి కళ్లు. మనకు మన చుట్టుపక్కల ఏముంది అనేవిషయాన్ని మనకు తెలియజేసేవి కళ్లు. అయితే శరీరంలో కళ్లు అనే అవయవం ఎప్పుడు అభివృద్ధిచెందివుంటుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనకు కళ్లు ఏర్పడి కోట్ల సంవత్సరాలు అయ్యాయని చెబుతున్నారు.

ఆష్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు అసలు మనిషికి కళ్లు ఎప్పుడు ఏర్పడివుంటాయి? అనే విషయంపై పరిశోధన సాగించారు. మనిషికి పూర్తిస్థాయి కళ్లు తొలిసారిగా ఏర్పడి 50 కోట్ల సంవత్సరాలైవుంటుందంటున్నారు. అన్ని కోట్ల సంవత్సరాలక్రితం మన కళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయని, ఇక అప్పటినుండి మనకు అవి లోకాన్ని చూపిస్తూ వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News