: భారత టూరిస్టుల స్వర్గధామం అబుదాబీయేనట!


భారత పర్యాటకులు ఆసియాలో ఎక్కువగా సందర్శించే దేశం అబుదాబీయేనట. ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశం అబుదాబీని సందర్శించే భారతీయుల సంఖ్య బాగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకుముందు ఈ ఆయిల్ కంట్రీ అందాలను వీక్షించేందుకు బ్రిటన్ వాసులు ఎక్కువగా విచ్చేసేవారు. ఇప్పుడు వారి స్థానాన్ని భారతీయులు ఆక్రమించారని అబుదాబీ టూరిజం శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇండియన్స్ కారణంగా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున లభించడమే కాకుండా, వాణిజ్యమూ ఊపందుకుంటోందని ఆ దేశ టూరిజం అధికారులంటున్నారు. గత ఆరునెలలో అబుదాబీని 78,053 మంది బ్రిటన్ పర్యాటకులు సందర్శించగా, భారత్ నుంచి 80,179 మంది ఆ దేశంలో పర్యటించారని రికార్డులు చెబుతున్నాయి. ఇక, 62,488 మందితో జర్మనీ బ్రిటన్ తర్వాతి స్థానంలో నిలిచిందట.

  • Loading...

More Telugu News