: సిటీలో రేపుల సంఖ్య పెరగడానికి 'తెలంగాణ'కు లింకుందట!


రాష్ట్ర రాజధానిలో మహిళలకు రక్షణ కరవవుతోంది. ఈ ఏడాది పోలీసు రికార్డుల్లో నమోదైన అత్యాచారాల సంఖ్య చూస్తే ఆ విషయం అవగతమవుతుంది. నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 112 రేపులు జరిగినట్టు గణాంకాలు చెప్పే వాస్తవం. గతేడాది జరిగిన అత్యాచారాలకు ఇంకా 38 తక్కువ కాగా.. వెలుగులోకి రానివి ఇంకెన్నో అఘాయిత్యాలు ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే, నగరంలో క్రైమ్ రేటు పెరగడానికి తెలంగాణ అంశానికి లింకుందంటున్నారు అధికారులు. గతకొన్నేళ్ళుగా ప్రత్యేక రాష్ట్రం పేరిట సాగుతున్న ఉద్యమాలతో నగరంలో అనిశ్చితి నెలకొందని, పోలీసులు నిరసనలు, ఆందోళనలపైనే దృష్టి పెట్టడంతో రేపులు, చోరీలు పెచ్చుమీరిపోయాయని వారు అంటున్నారు.

ఈ విషయమై ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) నేత సంధ్య ఏమంటున్నారో వినండి. 'ఒకప్పుడు నగరం ఎంతో సురక్షితంగా ఉండేది. కానీ, ఇప్పుడలాంటి పరిస్థితిని ఊహించలేం. మహిళల రక్షణకు తీసుకుంటామని చెప్పిన చర్యలన్నీ అటకెక్కాయి. వైద్య సేవలు అవసరమైతే 108ని పిలుస్తాం. అదే, రక్షణ అవసరమైన కొన్ని ప్రత్యేక సమయాల్లో ఏ నెంబర్ కు కాల్ చేయాలి? ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలి' అని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News