: కారు బాంబు పేలుళ్లలో 48 మంది మృతి


ఇరాక్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. షియాలు నివాసముండే ప్రాంతాల్లో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి.రాజధాని బాగ్దాద్ తో పాటు ఇతర నగరాల్లో కూడా ఈ పేలుళ్లు జరిగాయి. దీంతో ఈ ఘటనల్లో 48 మంది మృతి చెందగా, 100 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. గత మూడు నెలల్లో సంభవించిన వర్గపోరులో ఇప్పటి వరకు 2500 మంది అసువులు బాసారని ఐక్యరాజ్యసమింతి పేర్కొంది. ప్రధాని నూరి మాలిక్ వర్గానికి చెందిన షియాలను సున్నీలు టార్గెట్ చేస్తుండడంతో ఇరాక్ బాంబుదాడులతో దద్దరిల్లుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో 12 చోట్ల కార్లలో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు ఉగ్రవాదులు.

  • Loading...

More Telugu News