: ఐటి నిరుద్యోగులకు శుభవార్త
కొంతకాలం నుంచి ఐటి రంగంలో ఉద్యోగాలు లేక నిరుత్సాహంతో ఉన్న నిరుద్యోగులకు నాస్కామ్ సర్వే శుభవార్త వెల్లడించింది. రాబోయేకాలంలో ఐటి రంగంలో లక్షల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయని, రిక్రూట్ మెంట్స్ తప్పకుండా ఉంటాయని తన తాజా సర్వేలో తెలిపింది. 12 నుంచి 14 శాతం వరకు ఐటి రంగం వృద్ధిచెంది దాదాపు లక్షా పాతికవేల వరకు ఉద్యోగాలు ఉంటాయని పేర్కొంది. కానీ, ప్రస్తుత క్యాంపస్ ప్లేస్ మెంట్లలో ఎలాంటి తేడా ఉండదని నాస్కామ్ స్పష్టం చేసింది. ఈ వార్త ఐటి వృత్తి నిపుణులు, తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారికి కొంత ఊరట కలిగించనుంది.