: నిలకడగా శంకర్ రావు ఆరోగ్యం
ఒత్తిడికి గురవడం వల్లే ఎమ్మెల్యే శంకర్ రావుకు బీపీ పెరిగిపోయిందనీ, అనారోగ్యానికి లోనయ్యారని కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుందనీ, ఐసీయూలోనే వుంచి చికిత్స చేస్తున్నామని తెలిపారు. మరో ఇరవై నాలుగు గంటల పాటు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని డాక్టర్లు తెలిపారు. ఆయనకు ఇప్పటికే బైపాస్ సర్జరీ అయినందున జాగ్రత్తలు తీసుకోవలసి వుందని వైద్యులు చెప్పారు.