: ఐఏఎస్ ఆధికారిణి సస్పెన్షన్ వెనుక అసలు కారణం అదా!
ఉత్తరప్రదేశ్ లో ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగ్ పాల్ సస్పెన్షన్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆమెను బలిపశువును చేస్తున్నారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. దీంతో దిగి వచ్చిన యూపీ చీఫ్ సెక్రటరీ తమ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామన్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న ఓ ప్రార్థనాలయాన్ని కూల్చేయమని ఆదేశాలిచ్చినందుకు ఆమెను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2009 బ్యాచ్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారిణి ఆర్నెల్ల క్రితమే యూపీలో పోస్టింగ్ పొందారు. కాగా, యూపీ రాజకీయాల్లో ఉద్దండులుగా పేరుపొందిన వారి హస్తముందని ఆరోపణలున్న ఇసుక మాఫియాపై దాడులు నిర్వహిస్తూ ఆమె వార్తల్లో నిలిచారు. దానికి ప్రతీకారంగానే ప్రభుత్వం ఆమెను శిక్షిస్తోందని ఐఏఎస్ అధికారుల సంఘం ఆరోపిస్తోంది.