: వాళ్ళను చూసి నేర్చుకోండి: బౌలర్లకు కోహ్లీ సలహా
ధోనీ స్థానంలో టీమిండియా పగ్గాలు చేపట్టిన ఢిల్లీ డైనమైట్ విరాట్ కోహ్లీ తన బౌలర్లకు సలహా ఇస్తున్నాడు. తాజా జింబాబ్వే టూర్లో ఆతిథ్య జట్టు బౌలర్లను చూసి నేర్చుకోవాలని టీమిండియా పేసర్లకు సూచించాడు. మూడో వన్డే ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కొత్తబంతి అనుకూలతను భారత బౌలర్లకంటే జింబాబ్వే బౌలర్లే సమర్థవంతంగా అందిపుచ్చుకుంటున్నారని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. వారు సరైన ప్రదేశాల్లో బంతిని పిచ్ చేస్తూ ఫలితాలు సాధిస్తున్నారని కితాబిచ్చాడు. సీనియర్లకు విశ్రాంతి నేపథ్యంలో అవకాశాలు దొరకబుచ్చుకున్న వినయ్ కుమార్, షమి అహ్మద్ తమ అస్త్రాలకు మరింత పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కోహ్లీ అన్నాడు.