: తెలంగాణపై మజ్లిస్ ది ఒకేమాట: ఒవైసీ


తెలంగాణపై మజ్లిస్ పార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు. తామెప్పుడూ సమైక్యానికే మద్దతు పలుకుతామని ఆ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్ హైకమాండ్ కు ఓ లేఖ రాశారు. మొదటినుంచి తమది సమైక్యవాదమేనని, విభజనకు అంగీకరించబోమని లేఖలో పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాయల తెలంగాణకు సమ్మతమే అని గతంలో చెప్పిన మజ్లిస్, తాజాగా, ఏ ప్రతిపాదననూ ఒప్పుకునేది లేదని అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పది జిల్లాలతో తెలంగాణ ఇచ్చినా, హైదరాబాదును కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటించినా తాము వ్యతిరేకిస్తామని అసద్ తెలిపారు.

  • Loading...

More Telugu News