: రిషి, నీతూ కపూర్ కు నిద్ర దూరం చేస్తున్న రణ్ బీర్, కత్రినా అఫైర్
బాలీవుడ్ యువకెరటం రణ్ బీర్ కపూర్ ప్రేమ వ్యవహారం అతని తల్లిదండ్రులు రిషీ కపూర్, నీతూ సింగ్ కపూర్ లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో పలుమార్లు హెచ్చరికలు చేసిన అతని తల్లి నీతూ సింగ్ మరింత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. తాజాగా, స్పెయిన్ లో రణ్ బీర్, కత్రినా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు పేపర్లోనూ, ఇంటర్నెట్ లోనూ సందడి చేస్తుండడంతో ఈ అనుబంధం అతని కెరీర్ పై ప్రభావం చూపిస్తుందేమోనని ఆమె ఆందోళన చెందుతున్నారు. రణ్ బీర్ మాజీ గర్ల్ ఫ్రెండ్ దీపికా పదుకునేతో బ్రేకప్ కి కారణం అతని తల్లేనన్న ఆరోపణలను అతను ఖండించినా అభిమానులు నమ్మడం లేదు. కత్రినాతో పుత్రుడి అనుబంధం కూడా ఆమెకు నచ్చట్లేదని బాలీవుడ్ సమాచారం.