: 'అవనిగడ్డ' పోటీనుంచి తప్పుకున్న వైఎస్సార్సీపీ
కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక పోటీనుంచి వైఎస్సార్సీపీ తప్పుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు వంగవీటీ రాధా, సామినేని ఉదయభాను తెలిపారు. ఇంతకుముందు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన అంబటి బ్రాహ్మణయ్య మీద ఉన్న గౌరవంతోనే ఈ పోటీనుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అంతేకానీ, చంద్రబాబు నాయుడు లేఖ రాసినందుకు కాదన్నారు.