: లంచ్ వేళకు ఆసీస్ స్కోరు 126/2
భారత్ తో మొదటి టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్ (58), వాట్సన్ (28) ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఆసీస్ జట్టుకు ఓ మోస్తరు శుభారంభం దక్కింది. తొలి వికెట్ కు ఓపెనర్లు వార్నర్, కొవాన్ (29) 64 పరుగులు జోడించారు. కాగా, ఆసీస్ కోల్పోయిన రెండు వికెట్లు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఖాతాలోకే వెళ్లాయి.