: జగనే పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు: కొండా సురేఖ
వైఎస్సార్సీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్ లో జగన్ కు బహిరంగ లేఖ రాసిన ఆమె పలు ఆరోపణలు చేశారు. 'మాట తప్పం, మడమ తిప్పం' అని చెప్పుకునే జగన్ అజెండా 'మాట తప్పడం, మడమ తిప్పడం' అని తెలిపారు. వైఎస్సార్సీపీ ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా తయారైందన్నారు. జగన్ జైలు నుంచే సూచనలు, సలహాలు ఇస్తూ.. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.