: పశ్చిమ బెంగాల్ పంచాయతీల్లో తృణమూల్ కాంగ్రెస్ గాలి


పశ్చిమ బెంగాల్ లో దీదీ వ్యతిరేక ప్రచారం ఏమాత్రం పని చేయలేదు. ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభం కాగా, ఆది నుంచీ 17 జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, శారదా చిట్ ఫండ్స్ కుంభకోణంలో దీదీ పార్టీ హస్తముందన్న ప్రత్యర్ధుల ప్రచారం వ్యర్థమైంది. బెంగాల్లో మమతా బెనర్జీపై పలు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు పంచాయతీ పోరుకు బరిలో దిగాయి. ఈ ఎన్నికల్లో హింస చోటు చేసుకోవడంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే గాకుండా పలువురు క్షతగాత్రులైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News