: భారత్, టిబెట్ లది గురుశిష్యుల బంధం: దలైలామా


మహత్మాగాంధీలా భారతీయులు అహింస, మతసామరస్యాలను అనుసరించాలని టిబెట్ మత గురువు దలైలామా ప్రవచించారు. గొప్ప నేతలైన మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా అహింసా మార్గాన్ని పాటించారని, దీనినే సత్యం, బలం అని విశ్వసించారని చెప్పారు. పుణె సమీపంలోని శివాజీ మహరాజ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన టిబెట్ కేంద్రాన్ని దలైలామా నిన్న ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. భారత్, టిబెట్ మధ్య సంబంధాన్ని గురుశిష్యుల బంధంగా అభివర్ణించారు. బౌద్ధం పుట్టింది భారత్ లోనేనని చెప్పారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ మ్యూజియంలో దలైలామా ప్రారంభించిన కేంద్రం 60 ఏళ్ల టిబెట్ చరిత్రను చిత్రాల రూపంలో కళ్లకు కడుతుంది.

  • Loading...

More Telugu News