: తెలంగాణ స్పూర్తితో సమ్మెకు దిగిన గూర్ఖాలాండ్


పశ్చిమ బెంగాల్లోని గూర్ఖాలాండులో మళ్లీ ఉద్యమవేడి రగులుకుంది. తెలంగాణపై కీలక నిర్ణయం వెలువరించే దిశగా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో, బెంగాల్లో 'గూర్ఖా జనముక్తి మోర్చా' (జీజేఎం) పోరుబాట పట్టింది. నేటి నుంచి 72 గంటల పాటు బందుకు పిలుపునిచ్చింది. ప్రత్యేక రాష్ట్రం కోరుతూ రెండు దశాబ్దాల పాటు గూర్ఖాలాండు వాసులు తీవ్ర ఉద్యమం చేశారు.

దాంతో, 2011 జులై 18న ప్రభుత్వం 'గూర్ఖాలాండు టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్' పేరుతో ప్రత్యేక కేటగిరీని ఇస్తూ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం జీజేఎం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరింది. తాజాగా, కేంద్రం ప్రభుత్వం తెలంగాణ ఇవ్వబోతున్న నేపథ్యంలో మళ్లీ గూర్ఖాలాండులో ప్రత్యేక రాష్ట్రం అంటూ ఉద్యమం మొదలైంది. రాష్ట్రాన్ని సాధించుకునేదాకా పోరాటం చేస్తామని ఉద్యమకారులంటున్నారు.

  • Loading...

More Telugu News