: జమ్మూ-శ్రీనగర్ హైవేపై విరిగిపడ్డ కొండచరియలు.. తప్పిన ముప్పు
కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉధంపూర్ జిల్లా సమ్రోలి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో 200 వాహనాలు ఆగిపోయాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది కొండచరియలను తొలగించే పనిని చేప్టటారు. అమర్ నాథ్ యాత్రికులు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కొండచరియలు విరిగిపడడానికి ముందే.. అమర్ నాథ్ భక్తులతో కూడిన కొన్ని వాహనాలు ఇదే మార్గంలో కాశ్మీర్ లోయ వైపు వెళ్లిపోయాయని పోలీసులు తెలిపారు. అవి అటు వెళ్లిన తర్వాత కొండచరియలు విరిగిపడడంతో ప్రాణాపాయం తప్పిపోయింది.