: ఆ అనాథ బాలలకు యూపీ ప్రభుత్వ సాయం


ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి, గ్రామస్తులు బహిష్కరించడంతో కొంతకాలంగా స్మశానంలోనే నివసిస్తున్న ఉత్తరప్రదేశ్ అనాథ బాలల దయనీయ గాథ పట్ల ఆ రాష్ట్ర సర్కారులో చలనం వచ్చింది. దేశవ్యాప్తంగా వీరిపై పత్రికలు, ఛానళ్లలో వచ్చిన కథనాలు చూసి స్పందించిన యూపీ ప్రభుత్వం ఇల్లు కట్టుకునేందుకు వారి గ్రామంలో స్థలాన్ని కేటాయించింది. అంతేగాక ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయం మంజూరు చేసింది. అయితే, ఆ స్థలం తనదంటూ ఓ వ్యక్తి అభ్యంతరం చెబుతున్నాడు. 1998 నుంచి ఆస్తి వివాదం కారణంగా కోర్టు పెండింగులో ఉందంటున్నాడు.

రెండు నెలల కిందట యూపీలోని ప్రతాప్ ఘఢ్ జిల్లాలో తల్లిదండ్రులు ఎయిడ్స్ వ్యాధితో చనిపోవడంతో ఐదుగురు బాలలు అనాథలయ్యారు. ఆ వ్యాధి పిల్లలకు సోకి ఊరంతా వ్యాపిస్తుందంటూ గ్రామస్తులు తరిమేశారు. దిక్కులేక, ఉండేందుకు చోటులేక తమ అమ్మానాన్నలను పూడ్చిపెట్టిన స్మశానంలోనే ప్లాస్టిక్ పట్టలతో ఇల్లులా వేసుకుని, దాంట్లోనే దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. చివరకు అక్కడినుంచి కూడా వెళ్లాలంటూ స్థానికులు ఒత్తిడి తెస్తున్నారు. విషయం అందరికీ తెలిసి, పత్రికల్లో రావడంతో ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండు చేశారు.

  • Loading...

More Telugu News