: జైల్లోనే సంజయ్ దత్ పుట్టినరోజు


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 54వ పడిలోకి అడుగుపెట్టాడు. పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న సంజూ ఈ బర్త్ డేను చాలా సాదాసీదాగా జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జైలు అధికారులు ఓనూట యాభై రూపాయల కేక్ ను స్థానికంగా ఆర్డర్ ఇచ్చారట. దీంతో పాటు ఛాయ్, కొన్ని బిస్కెట్లు ప్రత్యేకం. ఈ నెలలోనే (జులై 22) భార్య మాన్యత పుట్టినరోజు సందర్భంగా కవిత్వం రాసి, ఓ గులాబీని పంపాడు మున్నాభాయ్. ఎలాగు పిల్లలతో కలిసి వచ్చి జైల్లో ఉన్న సంజయ్ ను మాన్యత విష్ చేస్తుంది. మరి భర్తకు ఎలాంటి బహుమతిని ఇస్తుందో..!?

  • Loading...

More Telugu News