: మా అనుబంధంపై బయటకు మాట్లాడబోం: షారూక్


సల్మాన్ ఖాన్ తో అనుబంధంపై మాట్లాడడానికి నటుడు షారూక్ ఖాన్ నిరాకరించారు. ఇటీవలే కాంగ్రెస్ నేత బాబా సిద్దిఖీ ముంబైలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సల్మాన్, షారూక్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సల్మాన్, షారూక్ ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయని అందరూ భావించారు. 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్ర ప్రచారం కోసం కోల్ కతాకు వచ్చిన షారూక్ ను దీనిపైనే విలేకరులు ప్రశ్నించారు. 'మా మధ్య విరోధం, సంధి, ప్రేమ, చర్చలు.. ఇలా వీటి గురించి బహిరంగంగా మాట్లాడటం మాకు ఇష్టం లేదు' అని షారూక్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News