: తెలంగాణ అంశంపై యూపీఏ సమన్వయ కమిటీ భేటీ రేపే


యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం రేపు మధ్యాహ్నం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో మూడు గంటలకు జరగనుంది. మిత్రపక్షాలతో జరగనున్న ఈ భేటీలో తెలంగాణ అంశంపై కాంగ్రెస్ చర్చించనుంది. వెంటనే సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీన్ని బట్టి తెలంగాణ అంశంపై కసరత్తును కాంగ్రెస్ ముమ్మరం చేసినట్లు కనబడుతోంది.

  • Loading...

More Telugu News