: ఇటలీలో బస్సు ప్రమాదం.. 36 మంది దుర్మరణం


ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం 36 మందిని బలి తీసుకుంది. వారాంతంలో కేథలిక్ చర్చికి భక్తులను తీసుకెళ్లి, తిరిగి వస్తున్న బస్సు అవెల్లినో ప్రాంతంలో ఒక వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. మిగతావారు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకూ ఉన్నారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News