: రోబోతో ఆపరేషన్‌ : లైవ్‌లో శిక్షణ


ముంబాయిలోని బాంద్రాలోని ఆసియన్‌ హార్ట్‌ ఇన్స్‌టిట్యూట్‌ రోబోతో శస్త్ర చికిత్స చేస్తూ.. దానిని లైవ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైద్యులు హాజరు కానున్నారు. ఈనెల 30న నాలుకకు జరిగే ఈ శస్త్ర చికిత్సను లైవ్‌లో ఇతర డాక్టర్లకు నేర్పుతారు. అంటే.. ఇక్కడ ఆపరేషన్‌ జరుగుతున్న సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది డాక్టర్లు దాన్ని చూడగలుగుతారన్నమాట.

ఇటలీ నుంచి వస్తున్న, ఈ రోబో శస్త్రచికిత్సల రంగంలో ఆద్యులు అయిన డాక్టర్‌ క్లాడియో విసిని, డాక్టర్‌ ఫిలిపో మాంటెవెచ్చి ఇద్దరూ ఈ విషయంపై ప్రసంగిస్తారు. ట్రాన్సోరల్‌ రోబోటిక్‌ సర్జరీ అనే ఈ విధానం గురించి వారు తెలియజెప్తారు. ఇది ఒబేసిటీకి కూడా కారణం అవుతుండే ఒక సమస్య. భారత్‌లో మొదటిసారిగా ఈ ఆపరేషన్‌ను డాక్టర్‌ వికాస్‌ అగర్వాల్‌ చేశారు.

  • Loading...

More Telugu News