: ఆ డబ్బులు సరిపోవు: అఫ్రిది
పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్ మన్ షాహిద్ అఫ్రిది కరేబియన్ లీగ్ ఇచ్చిన ఆఫర్ ను తోసిపుచ్చాడు. కేవలం 50 వేల డాలర్లకే తనను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రావడంతో తాను లీగ్ కు దూరమవ్వాలనుకున్నట్టు అఫ్రిది తెలిపారు. గతంలో సెయింట్ లూసియా ఫ్రాంచైజీ లక్షా యాభైవేల అమెరికన్ డాలర్లను ఇస్తామంటే తోసిపుచ్చిన అఫ్రిది, తన ధర మరింత దిగజారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. జూలై 30 న ప్రారంభం కానున్న కరీబియన్ లీగ్ ఆగస్టు 24 వరకు జరుగనుంది.