: ఆ ఆరోపణలు ఉత్తుత్తినే : బీసీసీఐ


స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఇద్దరు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికపై బీసీసీఐ వర్కింగ్ కమిటీ చర్చించింది. ఫిక్సింగ్ ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరయిన గురునాథ్ మెయ్యప్పన్ పై నివేదికను ఐపీఎల్ పాలకమండలికి పంపించామని బీసీసీఐ కోల్ కతాలో వెల్లడించింది. వీరిపై ఆగస్టు 2న జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ తెలిపింది. అయితే స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో రాజ్ కుంద్రా, రాజస్థాన్ రాయల్స్, ఇండియా సిమెంట్స్ పై ఎలాంటి ఆధారాలు లేవని బీసీసీఐ ఉపాధ్యక్షుడు నిరంజన్ షా తెలిపారు. ఈ నివేదికను యధాతధంగా ఆమోదించడం నామమాత్రమేనని, దీంతో శ్రీనివాసన్ మరోసారి బీసీసీఐ అధ్యక్షపదవిని అధిష్ఠించడం లాంఛనమే అని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News