: ఉద్యమాల కాలం ముగిసింది.. నిర్ణయ కాలమే మిగిలుంది: రాఘవులు
తెలంగాణ అంశాన్ని రాజకీయ క్రీడగా కాకుండా బాధ్యతగా చూసి నిర్ణయం తీసుకోవాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. విజయవాడలో మాకినేని రామారావు సంస్మరణ సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాల కాలం ముగిసిందని, ఇక మిగిలింది నిర్ణయమేనని అన్నారు. విభజన జరుగుతుంది, జరగదు అంటూ అనిశ్చితి నెలకొనడానికి కారణం నేతలేనని ఆరోపించారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల్ని కాకుండా స్వార్థ ప్రయోజనాలను కొలబద్దగా తీసుకుని తప్పుడు ప్రకటనలు గుప్పిస్తూ రాజకీయ పార్టీల నేతలు ప్రజలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ బాధ్యతగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాఘవులు కోరారు.