: ఆజాద్ మీడియా సమావేశం రద్దు


ఈ ఉదయం తెలుగు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం రండంటూ మీడియా వారికి వర్తమానం పంపిన ఆజాద్ తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్న అధిష్ఠానం పెద్దలు ఆజాద్ ఏం చెప్పినా అల్లర్లు చెలరేగే అవకాశముందని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశాన్ని రద్దు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణపై తేల్చేశారన్న ఊహాగానాల నేపథ్యంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News